: ప్రియుడితో పారిపోతున్న యువతిని రాళ్లతో కొట్టి చంపిన తాలిబన్లు


పెద్దలు కుదర్చిన పెళ్లి ఇష్టం లేని ఒక యువతి, తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి పారిపోవాలనుకున్న ఆ యువతిని తాలిబను ఉగ్రవాదులు రాళ్లతో కొట్టి చంపిన సంఘటన ఆప్ఘనిస్తాన్ లో జరిగింది. అయితే, ఈ సంఘటనను గుర్తుతెలియన వ్యక్తులు కొందరు తమ వీడియోలో షూట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు మీడియా ద్వారా బయటపడింది. ఆఫ్గనిస్తాన్ లోని ఘర్ రాష్ట్రంలో గతవారం ఈ దారుణ సంఘటన జరిగింది. రాక్ సహానా అనే ముస్లిం యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. అయితే, సహానా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అతనితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఒకరోజు, తన ప్రియుడితో కలిసి పారిపోతుండగా తాలిబన్లు ఆమెను పట్టుకున్నారు. రాళ్లతో కొట్టారు. రాళ్ల దెబ్బలు భరించలేని సహానా రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ సంఘటన చూస్తున్న గ్రామస్తులు మౌనంగా ఉండటం మినహా ఏమీ చేయలేకపోయారు. ఈ దృశ్యాలన్నీ 30 నిమిషాల వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయమై ఘర్ రాష్ట్ర మహిళా గవర్నర్ సీమ జోయేంద్ర మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మతపెద్దలు, సాయుధ తాలిబన్ల సమక్షంలో సహానాను రాళ్లతో కొట్టి చంపివేశారని, ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నామని జోయేంద్ర తెలిపారు.

  • Loading...

More Telugu News