: మళ్లీ పగిలిన దేవాదుల పైప్ లైన్... వృథాగా పోతున్న నీరు


వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట శివారులోని ఓ పొలంలో దేవాదుల పైప్ లైన్ మళ్లీ పగిలింది. దాంతో పైప్ లైను నుంచి భారీ ఎత్తున నీరు ఎగసిపడి వృథాగా పోతోంది. నెల రోజుల వ్యవధిలో పైప్ లైన్ పగలడం ఇది మూడోసారి. పైప్ లైన్ నిర్వహణను ఒక ప్రత్యేక యంత్రాంగం పర్యవేక్షిస్తుంటుంది. అయినప్పటికీ తరచూ పైపు లైన్ పగిలి నీరు వృథాగా పోతుండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పైప్ లైన్ పగిలిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News