: పాక్ నటులను బాలీవుడ్ లో అడ్డుకోరు: సల్మాన్ ఖాన్
పాకిస్థాన్ నటులను బాలీవుడ్ లో ఎవరూ అడ్డుకోరని ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ముంబైలో సల్మాన్ మాట్లాడుతూ, బాలీవుడ్ నటులకు పాకిస్థాన్ లో కూడా అభిమానులున్నారని అన్నాడు. పాకిస్థాన్ వారైనంత మాత్రాన వారికి బాలీవుడ్ లో స్థానం లేదని కించపర్చడం సరికాదని హితవు పలికాడు. సాంకేతిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత కాలంలో టీవీలలో ఎవరికి నచ్చిన కార్యక్రమాలను వారు చూస్తున్నారని సల్లూ భాయ్ చెప్పాడు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని సల్మాన్ సూచించాడు. కాగా, పాకిస్థాన్ నటులను ముంబైలో అడుగుపెట్టనీయమని శివసేన హెచ్చరించిన సంగతి తెలిసిందే.