: సుప్రీం తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: విమలక్క


ఏబీఎన్ ప్రసారాలను తెలంగాణలో వెంటనే పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుపై తెలంగాణ యునైటెడ్ ఫోరం అధ్యక్షురాలు విమలక్క హర్షం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం ఎవరి తరం కాదని ఆమె అన్నారు. ఎంఎస్ఓలను అడ్డం పెట్టుకుని ఏబీఎస్ ప్రసారాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. ఇప్పటికైనా అణచివేత ధోరణులకు ప్రభుత్వం స్వస్తి పలకాలని విమలక్క సూచించారు.

  • Loading...

More Telugu News