: బీపీఎల్ కార్డుదారులకు రూ.50 కే కందిపప్పు
నెల్లూరు జిల్లా ప్రజలకు కిలో కందిపప్పు రూ.50 కే అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ నెలలో చౌకధరల దుకాణాల ద్వారా బీపీఎల్ కార్డుదారులకు ఈ ధరకే కందిపప్పు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండి, కిరోసిన్ ను కార్డుదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. దీపావళి పండగ సందర్భంగా అరకిలో చక్కెరను అదనంగా ఇస్తామని, బీపీఎల్ కార్డుదారులందరికీ సాధారణ కోటా కింద అరకిలో, అదనపు కోటాగా మరో అరకిలో కలిపి పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.