: సమస్త సంపద ఎవరి దగ్గరుంటుందో తెలుసా?... సౌత్ బ్యూటీ సమంత సమాధానం ఇదే!
దక్షిణాది బిజీ హీరోయిన్ సమంత ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయింది. ఈ మధ్యాహ్నం 1:22 గంటలకు ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ పెడుతూ, సమస్త సంపద ఎవరి దగ్గరుంటుందో తెలుసా? అని ప్రశ్నించి దానికి సమాధానం తనే చెప్పింది. "ఎవరైతే సుఖం, దు:ఖం, అదృష్టం, దురదృష్టం, గతం, భవిష్యత్తు తదితరాలను సమంగా చూస్తారో వారే దానికి పాత్రులవుతారు... ఇదే మహాభారత సారం" అంటూ సమాధానం చెప్పింది. "Who has every kind of wealth ? "Only he to whom joy and sorrow,fortune and misfortune,past and future,are all the same . The Mahabharata" అంటున్న సమంత, ఇంత సడన్ గా మహాభారతంలోని వేదాంత సారాన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకుందో!