: ఎవర్నడిగి భారత్ వెళ్లావంటూ షహర్యార్ ఖాన్ కు పాక్ నోటీసులు


ఎవరినడిగి భారతదేశం వెళ్లావంటూ పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ కు పాకిస్థాన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అసలు భారత్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియజేయాలంటూ వివరణ కోరింది. పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ నేతృత్వంలోని బృందం భారత్ వచ్చి బీసీసీఐ అధ్యక్షుడితో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు వారాల క్రితం ఆ బృందం ముంబై వచ్చి బీసీసీఐ చీఫ్ ను కలిసింది. ఈ సందర్భంగా శివసేన కార్యకర్తలు ఆ సమావేశాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పాక్ క్రీడల మంత్రి మియన్ రియాజ్ హుస్సేన్ పిర్జాదా ఆగ్రహం వ్యక్తం చేశారు. షహర్యార్ పాక్ ప్రభుత్వ అనుమతితోనే భారత్ వెళ్లారా? లేదా? వివరణ ఇవ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News