: బంగారం కోసం చెవుల్ని కోసేసిన దుర్మార్గులు
చెవులకున్న రెండు గ్రాముల బంగారం రింగుల కోసం ఆ చెవులనే కోసేసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మధ్యాహ్న భోజనం కోసం బయటకు రాగా, కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. బ్లేడుతో ఆమె చెవులు కోసి మరీ రింగులు దోచుకెళ్లారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం సమీప పరిసరాలు, చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.