: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై విచారణకు కోర్టు ఆదేశం


ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై విచారణ జరపాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవిభాజ్య కవలలు వీణ, వాణిల చికిత్స నిమిత్తం విరాళాలు సేకరించిన రాధాకృష్ణ... ఆ డబ్బును బాధితులకు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ జనార్దన్ గౌడ్ అనే అడ్వొకేట్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రాధాకృష్ణపై విచారణ జరిపి, ఈ నెల 16 లోపు నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది. అంతేకాకుండా, ఐపీసీ సెక్షన్లు 406, 420, 120(బి) కింద కేసు నమోదు చేయాలని సూచించింది.

  • Loading...

More Telugu News