: మరో బంపర్ బొనాంజా... నైపుణ్యం, కాస్త అదృష్టం తోడైతే రూ. 1కే జియోమీ ఫోన్!


ఈ దీపావళి సీజనులో కస్టమర్లు రూ. 1కే స్మార్ట్ ఫోన్ పొందేలా దివాలీ 'బంపర్ బొనాంజా' పేరిట జియోమీ కొత్త స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ వివరాలను ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. నవంబర్ 6 వరకూ కొనసాగే స్కీములో భాగంగా, ఎంఐ వెబ్ సైట్లో ఉంచిన పజిల్ ను నెటిజన్లు పూర్తి చేయాల్సి వుంటుంది. వరుసకు మూడు చొప్పున 9 దీపాలు ఒకదాని తరువాత ఒకటి వెలుగుతూ ఓ ప్యాట్రన్ కనిపిస్తుంది. ఆ ప్యాట్రన్ ఆగిన వెంటనే 10 సెకన్ల లోగా దాన్ని తిరిగి గీయగలిగితే, రూ. 1కి ఫోన్ ను పొందేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లాష్ సేల్ రూపంలో ఈ ఫోన్లను విక్రయిస్తామని సంస్థ వెల్లడించింది. ఒక్కో యూజర్ కు ప్యాట్రన్ పూర్తి చేసేందుకు రోజుకు 5 అవకాశాలు మాత్రమే ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఫ్లాష్ సేల్ లో ముందు వచ్చిన వారికి ముందుగా అవకాశం లభిస్తుందని, దీంతో పాటు పలు మోడల్స్ పై భారీ రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించింది. కాస్త నైపుణ్యం, ఇంకాస్త అదృష్టం తోడైతే రూ. 1కే ఫోన్ పట్టేయొచ్చు. ఒకవేళ ప్యాట్రన్ లో విజయం సాధిస్తే, ఫ్లాష్ సేల్ ప్రారంభం కావడానికి ముందుగానే లాగిన్ అయి, సెకనులో ఫోన్ ను క్లయిమ్ చేసుకోవాలని సలహా.

  • Loading...

More Telugu News