: అనుమానిత ఎగిరే వస్తువులు, లేజర్ లైట్లు... వెరసి భద్రతాధికారులకు నిద్రలేని రాత్రులు!


ఏదో ఎగిరే వస్తువు చీకట్లో మెరుస్తూ గాల్లో కనిపిస్తుంది. అదేంటో తెలియదు. సమీపంలోని ఓ ప్రాంతం నుంచి లేజర్ లైట్లు వెలుగుతాయి. అవి ఎందుకు వెలిగాయో తెలియదు. ఏం జరగదులే అని ఊరుకునే పరిస్థితి కాదు..! ఇదే న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందికి నిద్రలేని రాత్రులను మిగిలిస్తోంది. విమానాశ్రయ భద్రతను పర్యవేక్షించే సిబ్బందికి గాల్లో అనుమానాస్పద వస్తువులు ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఇటీవల ఇలాగే ఓ ఎగిరే పళ్లెం లాంటి ఆకారం వస్తుంటే, అదేంటో చూసేందుకు విమానాల రాకపోకలను నిలిపి మరీ హెలికాప్టర్ ను పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సమీప ప్రాంతాల నుంచి లేజర్ లైట్లు తమవైపు ఫోకస్ కావడం ఎన్నోసార్లు చూశామని పైలట్లు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న లైట్ల సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు యువత ఈ పని చేస్తున్నదని భావించినా, గురి చూసి కాల్చేందుకు ఎవరైనా ఉగ్రవాదులు వాడితే... పరిస్థితి ఏమవుతుందని పైలట్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడీ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఇంటెలిజన్స్ బ్యూరో, సీఐఎస్ఎఫ్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఢిల్లీ పోలీసులు సమావేశమై, చుట్టు పక్కల ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఏవైనా ఎగురుతున్న వస్తువులు కనిపిస్తే, వాటిని తక్షణం నేలకూల్చాలని కూడా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News