: చెన్నైలోని 'అమరావతి' శిల్పాలను తరలించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు


తమిళనాడు ప్రభుత్వ మ్యూజియంలో ఉన్న ఏపీ రాజధాని అమరావతి శిల్పాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు తమిళనాడు సీఎం జయలలితకు లేఖ రాశామని అమరావతి అభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు వీరాంజనేయులు జాస్తి తెలిపారు. రాజధాని చెన్నై ఎగ్మోర్ లోని మ్యూజియంలో కొన్ని వందల అమరావతి శిల్పాలు భద్రంగా ఉన్నాయి. ప్రస్తుతం నవ్యాంధ్రకు రాజధాని నిర్మిస్తుండటంతో ఆ శిల్పాలను ఏపీకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ రాసిన లేఖకు తమిళనాడు సానుకూలంగా స్పందించిందని, తగిన నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆ రాష్ట్ర అధికారులు ఎగ్మోర్ మ్యూజియం అధికారులను ఆదేశించారని తెలిసింది. అప్పటి అమరావతిలో బౌద్ధులకు సంబంధించిన శిల్పాలు 400లకుపైగానే మ్యూజియంలో ఉన్నాయి. బ్రిటీష్ పాలకులు నాడు నిర్వహించిన పురావస్తు తవ్వాకాల్లో ఈ శిల్పాలన్నీ బయటపడ్డాయి. తరువాత వాటిని నాటి మద్రాస్ కు తీసుకొచ్చి భద్రపరిచారు.

  • Loading...

More Telugu News