: వైన్ షాపులను ఎత్తేయండి మహాప్రభో!... ఫిల్మ్ నగర్ రోడ్లపై మహిళల ఆందోళన


తెలుగు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధంపై ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్య నిషేధం అమలుకు తీర్మానాలు చేశారు. పక్కాగా అమలు చేస్తున్నారు. ఇక ఏపీలోనూ సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఉద్యమాలు చేపడతామని కొత్త రాజకీయ పార్టీ ‘నవ్యాంధ్ర పార్టీ’ అధ్యక్షుడు కత్తి పద్మారావు నిన్న ప్రకటించారు. తాజాగా హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ మహిళలు కూడా మద్యపాన నిషేధం కోసం ఉద్యమంలోకి దూకేశారు. ఫిల్మ్ నగర్ పరిధిలోని వైన్ షాపుల వద్దకు దూసుకువచ్చిన మహిళలు మద్యం షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైన్ షాపుల ముందున్న రోడ్లను దిగ్బంధించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News