: వార్డుల విభజనలో ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గింది: బీజేపీ నేత లక్ష్మణ్
జీహెచ్ఎంసీ వార్డుల విభజనలో ప్రభుత్వం ఎంఐఎం పార్టీ ఒత్తిడికి తలొగ్గిందని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. అంతేగాక ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్న ఆయన, సంక్రాంతి సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. ఈ రోజు బీజేపీ నేతలు లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇంకా పలువురు బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపు, వార్డుల విభజనపై ఫిర్యాదు చేశారు. ఇష్టారాజ్యంగా వార్డులను విభజించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.