: షారుక్ ఖాన్ పాక్ ఏజెంట్... కావాలంటే అక్కడికి వెళ్లిపోవచ్చు: సాద్వీ ప్రాచీ


సృజనపరమైన, మతపరమైన అసహనం దేశంలో ఉండటం తగదనీ, అసహనం దేశానికి చేటంటూ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పేర్కొనడంపై విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ మహిళా నాయకురాలు సాద్వీ ప్రాచీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనో పాకిస్తాన్ ఏజెంట్ అని, కావాలంటే పాక్ కు వెళ్లిపోవచ్చని సూచించారు. అంతేగాక అనుచిత వ్యాఖ్యలు చేసిన షారుక్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా పద్మశ్రీ, ఇతర ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కిచ్చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సాద్వీ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News