: ఏపీ ఆర్థిక రాజధానిలో భోపాల్ డాన్
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అరాచకశక్తుల కన్ను పడుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్నంపై వారు దృష్టి సారిస్తున్నారు. తాజాగా భోపాల్ డాన్ గా పేరుగాంచిన ముక్తార్ మాలిక్ విశాఖలో మకాం వేశాడన్న సమాచారం వేడి పుట్టిస్తోంది. రెండు రోజుల క్రితమే అతను విశాఖలో అడుగుపెట్టాడని తెలుస్తోంది. ఈ క్రమంలో నిఘా వర్గాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. విశాఖకు ముక్తార్ ఎందుకు వచ్చాడు? అతని ప్లాన్ ఏంటి? విశాఖలో ఎవరెవరిని కలుస్తున్నాడు? అనే కోణంలో వారు నిఘా పెట్టారు.