: ఐపీఎల్ సీఓఓ సుందర రామన్ రాజీనామా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర రామన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆమోదించింది. ఐపీఎల్ ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ లో సుందర రామన్ పాత్రపై ముద్గల్ కమిటీ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల బీసీసీఐ కొత్త చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన శశాంక్ మనోహర్ ఐపీఎల్ సీఓఓ పదవిలో సుందర రామన్ ఇంకా కొనసాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్గల్ కమిటీ నివేదిక సమర్పించిన మరునాడే సుందర రామన్ తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని కూడా మనోహర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నిన్న నాగ్ పూర్ లో శశాంక్ ను కలిసిన సుందర రామన్ తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ లేఖను పరిశీలించిన బీసీసీఐ ఆయన రాజీనామాకు ఆమోద ముద్ర వేసింది.