: ఇంత జరుగుతున్నా ఫాంహౌస్ లో నిద్రపోతున్నారు: కేసీఆర్ పై రమణ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారని... దీనికంతా కేసీఆర్ అసమర్థతే కారణమని ధ్వజమెత్తారు. రోజుకో హామీ ఇవ్వడమే కాని, వాటిని నెరవేర్చింది ఏమాత్రం లేదని విమర్శించారు. ఓ వైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే... ఏమీ పట్టని కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ లో నిద్రపోతున్నారని మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని... ఎన్డీయే అభ్యర్థి దేవయ్య విజయం సాధించడం ఖాయమని చెప్పారు.