: అణుబాంబుల తయారీలో భారత్ జోరు!
అణ్వస్త్రాలను సమకూర్చుకోవడంలో భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. గత సంవత్సరం నాటికే ఇండియా వద్ద 125 అణ్వాయుధాలకు సరిపడా ప్లూటోనియం ఉందని, ఇక ఈ యేటి అంచనాల ప్రకారం, 175 వరకూ ఆయుధాలకు సరిపడా అణు శక్తి ఉండవచ్చని, 138 అణ్వాయుధాల తయారీ పూర్తయి ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపింది. ఇక యురేనియం నిల్వల విషయానికి వస్తే, పెను విద్వంసం సృష్టించగల యురేనియం రకం నుంచి 70 శాతం వరకూ ఆయుధాలను తయారు చేసేందుకు ఇండియా వాడి ఉంటుందని వెల్లడించింది.