: మోదీ దిష్టిబొమ్మల దహనంపై చంద్రబాబు స్పందించాలి: సోము వీర్రాజు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను రాష్ట్రంలోని పలు చోట్ల దహనం చేస్తుండటంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే భావన సరికాదని చెప్పారు. 30 సంవత్సరాలకు పైగా ప్రత్యేక హోదా ఉన్న అసోం రాష్ట్రం ఇప్పటికీ ఎందుకు అభివృద్ధి చెందలేదో తెలుసుకోవాలన్నారు. అనంతపురంలో ఈ మేరకు విలేకరులతో వీర్రాజు మాట్లాడారు. ఏపీకి హోదా ఇవ్వడంలో కేంద్రానికి ఇబ్బందులున్నాయని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హోదా కన్నా ఎక్కువ నిధులు ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News