: అమెరికాపై దాడులు పెంచాలంటూ ఆల్ ఖైదా నేత అల్ జవహరి పిలుపు


ఆల్ ఖైదా నేత అమాన్ అల్ జవహరి పాశ్చాత్య దేశాలపై దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై దాడులను మరింత పెంచాలని ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అందులో జవహరి మాటలను అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్ అనువాదం చేసింది. బోస్టన్ లో జరిగిన బాంబు పేలుళ్ల తరహాలో బాంబు దాడులు జరపాలని, టర్కీ నుంచి ఉత్తరాఫ్రికా వరకు జిహాదీలంతా ఒక్కటి కావాలని ఆల్ ఖైదా చీఫ్ పిలుపునిచ్చాడు. ఇదే సమయంలో ఇటీవల ఇజ్రాయెల్ పై పాలస్తీనియన్లు చేసిన దాడులను జవహరి ఈ వీడియోలో మెచ్చుకున్నాడు. సాధారణంగా ఉగ్రవాదానికి సంబంధించిన వెబ్ సైట్ లలోనే ఇలాంటి వీడియోలు రిలీజ్ అవుతుంటాయి. ఈసారి ఆల్ ఖైదా వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News