: అశ్విన్, భజ్జీల బౌలింగ్ పై పాక్ స్పిన్నర్ వివాదాస్పద ఆరోపణలు
పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా టాప్ స్పిన్నర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ ల బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని అజ్మల్ ఆరోపించాడు. వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారని... ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో హర్భజన్ చేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంగుతుందని... నిబంధనల ప్రకారం దీన్ని చకింగ్ గానే భావించాలని అన్నాడు. పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు, చకింగ్ చేస్తున్నాడని నిరూపితం కావడంతో, అజ్మల్ ప్రస్తుతం బహిష్కరణ వేటు ఎదుర్కొంటున్నాడు.