: ఆ 'సింహం' మోదీ మిత్రులకు మాత్రమే!


బీహారులో అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టం సమీపించింది. ఆఖరి విడత పోలింగుకు ప్రచారం నేటితో ఆఖరు కాగా, నేతల మధ్య విమర్శనాస్త్రాల పదును మరింతగా పెరిగింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ తీవ్రంగా విఫలమయ్యారని అన్నారు. "మంచి రోజులు వస్తాయని మీరు ఏడాదిన్నర క్రితం చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదు? మోదీ రాగానే ధరలు తగ్గిపోతాయని హామీ ఇవ్వగా, పప్పు ధర 200 రూపాయలకు పెరిగింది. కానీ, మోదీ ధరల పెరుగుదలపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రతి యువకుడికీ ఉపాధి లభిస్తుందని గతంలో రోజుకు ఐదారు సార్లు చెప్పిన ఆయన ఎంతమందికి ఉపాధిని కల్పించాడో అడగండి. మేకిన్ ఇండియా అంటూ ఆయన ఓ సింహాన్ని చూపించాడు. ప్రపంచమంతా దాన్ని తిప్పాడు. అది మోదీకి మిత్రులైన వారికి మాత్రమే ఉపాధిని చూపుతోంది. భారత నిరుద్యోగులకు కాదు. మోదీ స్నేహితులకు కాంట్రాక్టులు వస్తున్నాయి. డబ్బులు వస్తున్నాయి. యువత దగ్గరకు ఆ సింహం రావడం లేదు. రాదు కూడా" అని రాహుల్ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News