: తెలంగాణ బస్సులపై ఏపీ ప్రజల మక్కువ!


కర్నూలు ఆర్టీసీ బస్టాండు. జడ్చర్ల డిపోకు చెందిన హైదరాబాద్ వెళ్లే బస్సు ప్లాట్ ఫాంపైకి వస్తోంది. కర్నూలు డిపో కండక్టర్లు దాన్ని అడ్డుకున్నారు. లైన్లో తమవి మూడు బస్సులు ఉన్నాయని, అవి వెళ్లాకే ప్లాట్ ఫాంపైకి రావాలని డిమాండ్ చేశారు. తమ బస్సు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైందని జడ్చర్ల డిపో బస్సు కండక్టర్ వాదించుకోవాల్సిన పరిస్థితి. ఒక్క కర్నూలు బస్టాండులో మాత్రమే కాదు. విజయవాడ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీఎస్ ఆర్టీసీ బస్సులను ఎక్కేందుకు ఉత్సాహం చూపుతున్నారు కాబట్టి. ఇంతకీ అసలు విషయం ఏమంటే, ఇటీవల ఏపీ సర్కారు బస్సు చార్జీలను పెంచగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం చార్జీల జోలికి పోలేదు. దీంతో ఒకే రూట్లో ప్రయాణిస్తున్న తెలంగాణ, ఏపీ బస్సుల మధ్య టికెట్ ధరల్లో వ్యత్యాసం వచ్చింది. తెలంగాణ బస్సుల్లో ధరలు తక్కువగా ఉండటంతో ఆ బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు ఉత్సాహం చూపుతున్నారు. మరోవైపు వివిధ డిపోల నుంచి ముందస్తు రిజర్వేషన్ల విషయంలోనూ తెలంగాణ డిపోల బస్సులకు ఆదరణ పెరిగి, ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా మెరుగుపడింది. ఇక తెలంగాణలోనూ చార్జీలను పెంచాలని ఏపీ రవాణా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News