: జనావాసాల్లోకి వచ్చేసిన చిరుత... భయాందోళనలో మచ్చుపహాడ్ గ్రామస్థులు


అడవిలో ఆవాసాన్ని వదిలేసిన ఓ చిరుత నేరుగా జనావాసాల్లోకి వచ్చేసింది. ఆకలితో నకనకలాడుతున్న సదరు చిరుత జనావాసంలో కనిపించిన ఓ లేగదూడపై దాడి చేసింది. దీంతో సదరు జనావాసంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏ దిక్కు నుంచి వచ్చి చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ లో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మచ్చుపహాడ్ లోకి నిన్న రాత్రి చిరుత ప్రవేశించింది. గ్రామంలో ఓ లేగదూడపై దాడి చేసింది. అయితే జనాల అలికిడితో అక్కడి నుంచి పరారైంది. చిరుత సంచారం నేపథ్యంలో ప్రస్తుతం మచ్చుపహాడ్ లో భయం రాజ్యమేలుతోంది.

  • Loading...

More Telugu News