: పుణేలో ‘గులాబీ’ ఎంపీ షష్టిపూర్తి వేడుకలు... స్పెషల్ ఫ్లయిట్ లో తరలిన పార్టీ నేతలు


ఆయనో వ్యాపారవేత్త. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ చేస్తున్న పోరుకు ఆకర్షితులయ్యారు. ‘గులాబీ’ దళంలో చేరిపోయారు. ఆ తర్వాత మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొన్నటి ఎన్నికల్లో బరిలోకి దిగారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా వీచిన గాలి కారణంగా ఆయన సులువుగానే లోక్ సభలో అడుగుపెట్టారు. ఎంత రాజకీయ వేత్తగా మారినా, అప్పటిదాకా సాగిన వ్యాపారవేత్త నైజం ఎక్కడికి పోతుంది చెప్పండి? అసలు విషయం ఏంటంటే... ప్రముఖ పారిశ్రామికవేత్త, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు నిన్నటితో 60 ఏళ్లు నిండాయి. 61వ ఏట అడుగుపెట్టిన పాటిల్ షష్టిపూర్తి కార్యక్రమం నిన్న మహారాష్ట్రలోని పుణేలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే పార్టీ నేతలు, మంత్రుల కోసం బీబీ పాటిల్ ఏకంగా హైదరాబాదు నుంచి ఓ ప్రత్యేక విమానాన్నే ఏర్పాటు చేశారు. నిన్న హైదరాబాదు నుంచి బయలుదేరిన ఈ విమానంలో తెలంగాణ మంత్రులు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఫుణే చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటల దాకా బీబీ పాటిల్ ఇచ్చే విందుతో సేదదీరనున్న వీరంతా తిరిగి ప్రత్యేక విమానంలోనే హైదరాబాదుకు బయలుదేరతారు.

  • Loading...

More Telugu News