: ఎట్టకేలకు కదిలిన పాక్... హఫీజ్ మీడియా కవరేజ్ పై నిషేధం


ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్ ఎట్టకేలకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ముంబై బాంబు పేలుళ్ల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్- దవా సహా పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన కార్యకలాపాలపై మీడియా కవరేజ్ ను నిషేధిస్తూ ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక జమాత్ తో పాటు ఫలా-ఈ-ఇన్సానియాత్ ఫౌండేషన్ తదితర సంస్థలను లష్కరే తోయిబా సంస్థకు అనుబంధ సంస్థలేనని కూడా పాక్ అంగీకరించింది. పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం శాటిలైట్ టీవీ చానెళ్లు, ఎఫ్ఎం రేడియోలు ఇకపై జమాత్ తదితర సంస్థల కార్యకలాపాలను ప్రసారం చేయడం నిషిద్ధం. ఐక్యరాజ్యసమితి నిషేధాజ్ఞల ప్రకారమే ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధిస్తున్నట్లు కూడా సదరు ఉత్తర్వుల్లో పాక్ ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News