: ‘దత్తత’ ప్రజలతో సినీనటుడు ప్రకాశ్ రాజ్
మహబూబ్ నగర్ జిల్లాలోని దత్తత గ్రామం కొండారెడ్డిపల్లిలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలతో, మహిళలతో మాట్లాడారు. గ్రామ సమస్యలను, వారి అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై గ్రామసభ ద్వారా ఆయన చర్చించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఆ గ్రామంలో పర్యటించిన ఫొటోలను పోస్ట్ చేశారు. కాగా, సామాజిక బాధ్యతలో భాగంగానే ప్రకాశ్ రాజ్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా పదిమంది యువకులను ఎన్నుకోవాలని, వారితో కలిసి తాను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని నాడు ప్రకాశ్ రాజ్ చెప్పిన విషయం తెలిసిందే.