: మోదీ ఇలాకాలో బీజేపీకి పరాభవం


ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. వారణాసి పార్లమెంట్ పరిధిలో 48 జిల్లా పరిషత్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఉత్తరప్రదేశ్ లో అధికారపార్టీ సమాజ్ వాదీ పార్టీ బలపరిచిన 25 మంది అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. బీఎస్పీ 3, అప్నా దళ్ 4, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. మోదీ దత్తత తీసుకున్న జయపుర గ్రామంలో బీఎస్పీ విజయం సాధించడం విశేషం. సెక్టార్ 1, 7లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ మద్దతిచ్చిన పంచాయతీ ప్రెసిడెంట్ సుజీత్ సింగ్ విజయం సాధించారు. కాగా, బీహార్ ఎన్నికల చివరి దశ ఎన్నికలకు ముందు బీజేపీని ఈ ఫలితాలు ఇబ్బంది పెట్టేవేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News