: టీటీడీపై తీరుపై కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం
టిటిడి అధికారుల తీరుపై భక్తులు మండిపడ్డారు. తమకు ముందుగా సమాచారం తెలియజేయకుండా సుప్రభాత సేవను నిలిపివేయడంపై ఆగ్రహించిన భక్తులు తిరుమలలోని సీఆర్ వో కార్యాలయం ముందు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. వాస్తవానికి ప్రతి రోజు 100 సుప్రభాత సేవా టికెట్లను ఆర్జిత సేవా టికెట్ల కౌంటర్ లో సామాన్య భక్తులకు జారీ చేస్తుంటారు. వీటికోసం భక్తులు నిన్న రాత్రి నుంచే క్యూలో పడిగాపులు పడుతూ వేచి ఉన్నారు. తీరా ఈ ఉదయం చంద్రగ్రహణం కారణంగా సుప్రభాత సేవను రద్దు చేస్తున్నామని ప్రకటించడంతో భక్తులకు కోపం కట్టలు తెచ్చుకుంది. దీంతో అధికారులు, సిబ్బంది తీరుపై మండిపడ్డారు. అధికారులు సర్ది చెప్పడంతో ఎట్టకేలకు వారు వెనుదిరిగారు.