: నమ్మగలరా? ఈ సీరియల్స్ 50 ఏళ్లకు పైగా సాగాయి!


సీరియల్ ఏడాది పాటు సాగితే 'వామ్మో...ఇదేం సీరియల్ రా బాబు!' అనుకోవడం మామూలే. అలాంటిది ఏమాత్రం గ్యాప్ లేకుండా 50 ఏళ్ల పాటు సీరియల్ సాగితే... దానిని ఏమనాలి? 1950వ దశకంలో సోప్ బాక్స్ ద్వారా ఇంట్లోకి చొచ్చుకొచ్చిన కొన్ని సీరియళ్లు దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. అమెరికాలోని సీబీఎస్ ఛానెల్లో ప్రసారమైన 'ద గైడింగ్ లైట్' సీరియల్ 57 ఏళ్ల పాటు కొనసాగింది. 1952 నుంచి ప్రసారమైన ఈ సీరియల్ కు ఆదరణ తగ్గడంతో 2009లో నిలిపేశారు. 'యాజ్ ద వరల్డ్ టర్న్స్' అనే సీరియల్ సుమారు 52 ఏళ్లు ప్రసారమైంది. దీనిని 'ద గైడింగ్ లైట్' కు సిస్టర్ సీరియల్ అనే వారు. మూడో స్థానంలో 'జనరల్ హాస్పిటల్' (50 ఏళ్లు) సీరియల్ ప్రసారమైంది. 1963 ఏప్రిల్ 1న తొలిసారి ప్రసారమైన ఈ సీరియల్ నేటికీ ప్రసారమవుతోంది. 'డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్' (50 ఏళ్లు) సీరియల్ 1965 నవంబర్ 8 నుంచి నేటికీ ప్రసారమవుతోంది. ఇది వివిధ దేశాల్లో విజయం సాధించడం విశేషం. 'ద యంగ్ అండ్ రెస్ట్ లెస్' (42 ఏళ్లు) సీరియల్ 1973 మార్చి 26న ప్రారంభమై, ప్రస్తుతం వారాంతాల్లో ప్రసారమవుతోంది. 'ఆల్ మై చిల్డ్రన్' (41 ఏళ్లు) సీరియల్ 1970 జనవరి 5 నుంచి 2011 సెప్టెంబర్ 23 వరకు ప్రసారమైంది. ఆన్ లైన్ లో మరో రెండేళ్లు కొనసాగింది. ఈ సీరియల్స్ అన్నీ అమెరికాలో ప్రసారం కాగా, ఏళ్ల తరబడి వాటిని అక్కడి ప్రజలు ఆదరించడం విశేషం.

  • Loading...

More Telugu News