: అశ్విన్ ను ఎదుర్కోవడమే సవాలు: డుప్లెసిస్
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎదుర్కోవడమే కఠిన పరీక్ష అని సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ తెలిపాడు. తొలి టెస్టుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో డుప్లెసిస్ మాట్లాడుతూ, అశ్విన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. చివరి వన్డే సందర్భంగా వాంఖడేలో రేగిన వివాదంతో భారత్ స్పిన్ పిచ్ లవైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న డుప్లెసిస్, వికెట్ ఆది నుంచి స్పిన్ కు అనుకూలించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. పరిస్థితిని బట్టి దూకుడు మంత్రం పఠిస్తామని డుప్లెసిస్ పేర్కొన్నాడు.