: విదేశాలతో పోటీపడేలా వరంగల్ ను తీర్చిదిద్దుతా: దేవయ్య
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పనిచేయాలన్న ఆలోచనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని దేవయ్య అన్నారు. వరంగల్ ఎంపీ ఉపఎన్నికకు టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దేవయ్య పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ ను స్మార్ట్ సిటీగా మార్చి విదేశాలతో పోటీపడేలా చేస్తానని అన్నారు. యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన చెప్పారు.