: రాజన్ ను డైరెక్టుగా ఢిల్లీకే తీసుకువస్తారట!


బాలి నుంచి మాఫియా డాన్ ఛోటా రాజన్ ను అధికారులు ముంబై తీసుకొస్తారా? లేక ఢిల్లీకి తీసుకొస్తారా? అనే ఆసక్తి నెలకొంది. ముంబైపై పట్టున్న ఛోటా రాజన్ ను అక్కడికే తరలిస్తారని తొలుత భావించినా, ఢిల్లీకే తీసుకొస్తారని ఇప్పుడు తెలుస్తోంది. చోటా రాజన్ కు ముంబైలో పట్టు ఉండడంతోపాటు, అతనికి శత్రువులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేరుగా ముంబై తీసుకెళ్తే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉందని భావించిన అధికారులు, ఇండోనేసియా నుంచి డైరెక్టుగా ఢిల్లీ తీసుకువస్తారని సమాచారం. అతనిపై ముంబైలో కేసులు ఉన్నాయి కనుక అతనిని ముంబై తీసుకొచ్చే అవకాశం ఉందని మరికొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రాజన్ ను ఢిల్లీ తీసుకువచ్చి, అక్కడ జైలులో సీబీఐ, ముంబై విచారణాధికారులు కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు. 20 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఛోటా రాజన్ పై భారత్ లో హత్యానేరాలు, ఆక్రమణలు, కిడ్నాపులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర కేసులున్నాయి.

  • Loading...

More Telugu News