: మనుషులతో కంటే రోబోతో సినిమా నిర్మించడం ఎంత సులువో తెలిసింది: జపాన్ దర్శకుడు


రోబోతో షూటింగ్ పూర్తి చేయడం చాలా సులభమని ప్రముఖ జపాన్ దర్శకుడు కోజి ఫుకడ తెలిపారు. 'సయొనారా' సినిమాను రూపొందిస్తున్న ఆయన ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన 'లియోనా'కు ఓ రోబోను ఎంచుకున్నారు. ఈ రోబోను రూపొందించేందుకు 76 లక్షలు ఖర్చైందని ఆయన తెలిపారు. ఈ రోబో ముమ్మూర్తులా మనిషిలా నవ్వగలదు, మాట్లాడగలదు, పాడగలదు, హావభావాలను పలికించగలదని అన్నారు. దీనికి 'జెమినాయిడ్ ఎఫ్' అని పేరు పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా నడుస్తుందని ఆయన వెల్లడించారు. అణుప్రమాదం మనుషులపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతుందనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. సినిమా పూర్తైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నటుల కంటే రోబోతో సినిమా నిర్మించడం ఎంత సులువో అనుభవపూర్వకంగా తెలిసిందని అన్నాడు. అదీ కాక రోబో అద్భుతమైన భిజనంతో బాటు, లగ్జరీ సూట్ బుక్ చేయాలనే డిమాండ్లు చేయదని వ్యంగ్యంగా అన్నాడు. కాగా, ఈ రోబోను హిరోషి ఇషిగురో సంస్థ రూపొందించింది. యంత్రాలతోపాటు రబ్బర్ ఉపయోగించడంతో ఇది అచ్చం మనిషిలా ఉందని వారు వివరించారు.

  • Loading...

More Telugu News