: బ్రిటన్ ను అలముకున్న పొగమంచు... 150 విమానాలు రద్దు
బ్రిటన్ లో దట్టంగా పొగమంచు అలముకుంది. దాంతో ఎదురుగా వంద గజాల దూరం వరకు కూడా ఏదీ కనిపించడంలేదు. మరికొన్ని రోజులపాటు పొగమంచు ఇలానే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా దాదాపు 150 విమానాల సర్వీసులను రద్దు చేశారు. హీత్రూ ఎయిర్ పోర్టులో 50, లండన్ సిటీ ఎయిర్ పోర్టులో 40, మాంచెస్టర్ ఎయిర్ పోర్టులో 24, ఎడిన్ బర్గ్ ఎయిర్ పోర్టులో 12, సౌతాంప్టన్ ఎయిర్ పోర్టులో 11 విమానాల రాకపోకలు రద్దయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.