: చదువు మానేసిన 79 ఏళ్లకి అందిన డిప్లొమా


చదువు మానేసిన 79 ఏళ్ల తరువాత తనను వరించిన డిప్లొమా పట్టాను పుచ్చుకుని మురిసిపోతోందో మహిళ. 1936లో అమెరికాలోని మిచిగాన్ లో 'క్యాథలిక్ స్కూల్ ఆప్ గ్రాండ్ ర్యాపిడ్ హైస్కూల్' లో పన్నెండేళ్ల వయసులో డిప్లోమా చదువుతున్న మార్గరెట్ థామ్ బెకెమా (97) తల్లి అనారోగ్యం బారినపడ్డారు. దీంతో తల్లిని చూసుకునేందుకు మార్గరెట్ చదువు మానేయాల్సి వచ్చింది. అలా కాలం గడిచిపోయింది. అయితే డిప్లొమా పట్టా పొందలేదన్న వెలితి ఆమెలో మిగిలిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు స్కూలు యాజమాన్యంతో మాట్లాడి, గౌరవ డిప్లొమా పట్టా ఇప్పించారు. దీంతో, చదువు మానేసిన 79 ఏళ్ల తరువాత కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో డిప్లొమా పట్టా స్వీకరించిన బెకెమా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

  • Loading...

More Telugu News