: తాహిర్...హోటల్ విడిచి వెళ్లవద్దు: దక్షణాఫ్రికా క్రికెట్ బోర్డు హెచ్చరిక


క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ ను బస చేస్తున్న హోటల్ విడిచి వెళ్లవద్దని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశించింది. పాకిస్థాన్ లో పుట్టిన ఇమ్రాన్ తాహిర్ సౌతాఫ్రికాకు ఆడుతున్నాడు. పాకిస్థానీలపై ముంబైలో దాడులు జరుగుతుండడంపై తాహిర్ ను ఆ బోర్డు హెచ్చరించింది. కాగా, తాహిర్ ముంబైలోని పలు ప్రాంతాలను కుటుంబంతో పాటు సందర్శించేందుకు ప్రణాళికలు రచించుకున్నాడు. తాజా హెచ్చరికల నేపథ్యంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సందర్భంగా సఫారీలకు ముంబైలో బస ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News