: ఉద్యోగులకు 'అమ్మ' ఇచ్చిన దీపావళి కానుక ఇదే!


తమిళనాట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జయలలిత భారీ కానుకను ప్రకటించారు. దీపావళి సందర్భంగా 3,76,464 మందికి ప్రయోజనం కలిగేలా రూ. 242.41 కోట్ల రూపాయలను బోనస్ గా అందించనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ, విద్యుత్, పౌర సరఫరాలు, హార్టికల్చర్, టీ బోర్డు, సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారులు... ఇలా పలు రంగాల్లోని ఉద్యోగులకు 20 శాతం బోనస్ ఇస్తామని తెలిపారు. వాణిజ్య పన్ను శాఖ ఉద్యోగులకు 1.67 శాతం కరవు భత్యంతో అదనంగా 10 శాతం బోనస్ ఇచ్చేందుకు ఆమె నిర్ణయించారు. ఇక చెన్నై మెట్రో, సీవరేజ్, హౌసింగ్ బోర్డులు, విద్యాశాఖలోని సీ, డీ విభాగాల కార్మికులు, పట్టు ఉత్పత్తి కేంద్రాల్లోని పనివాళ్లకు 20 శాతం దీపావళి బోనస్ అందుతుందని జయలలిత తెలియజేశారు. తమిళ సర్కారు నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News