: సెహ్వాగ్ అలా ఎలా మాట్లాడాడో... వీడ్కోలుపై మేమెలా నిర్ణయిస్తాం?: సెలక్టర్ల విస్మయం
తనకు చివరి మ్యాచ్ ఆడే అవకాశాన్ని సెలక్టర్లు ఇవ్వలేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించడం తమను ఆశ్చర్యపరిచిందని టీమిండియా సెలక్టర్లు వ్యాఖ్యానించారు. ఏ ఆటగాడిని కూడా రిటైర్మెంట్ తీసుకోవాలని తాము కోరబోమని వారు స్పష్టం చేశారు. ఓ మ్యాచ్ లో ఎంపిక చేయకపోతే, ఆ వెంటనే రంజీలు, దేశవాళీ టోర్నమెంట్లలో ఆడి సత్తా చూపించి రాణిస్తే, తిరిగి జట్టులోకి పిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వారు గుర్తు చేసుకున్నారు. సెహ్వాగ్ అలా చేయలేకపోయాడని అన్నారు. సెహ్వాగ్ అలా ఎలా మాట్లాడాడో అర్థం కావడం లేదని ఓ సెలక్టర్ వ్యాఖ్యానించారు. కాగా, డిసెంబర్ 3 నుంచి సెహ్వాగ్ సొంత గడ్డ ఢిల్లీలో జరిగే భారత్ - దక్షిణాఫ్రికా నాలుగో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆయన్ను సన్మానించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.