: దగ్గు మందు స్మగ్లింగ్...పట్టుబడ్డ ఎయిరిండియా సిబ్బంది


రాకపోకల్లో ఆలస్యం, సిబ్బంది అలసత్వం కారణంగా వార్తల్లో నిలిచే ఎయిరిండియా ఈ సారి సిబ్బంది అక్రమ రవాణా వ్యవహారంతో పతాక శీర్షికలకెక్కింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాల ప్రకారం...ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమాన సిబ్బంది 450 కాఫ్ సిరప్ (దగ్గు మందు బెనడ్రిల్) బాటిళ్ళను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వీటిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు విమాన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. నెల కిందట జరిగిన ఈ ఉదంతాన్ని ఎయిరిండియా దాచిపెట్టినప్పటికీ, ఇప్పుడు బట్టబయలైంది. దీంతో కేంద్ర మంత్రి మహేష్ శర్మ దీనిపై స్పందించారు. ఇలాంటి ఘటనలను క్షమించేది లేదని, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, బెనడ్రిల్ మోతాదుకు మించి తీసుకుంటే మత్తుమందు ఇచ్చే అనుభూతినిస్తుందని పాశ్చాత్య దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. కాగా, లండన్ లో బెనడ్రిల్ కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. దీంతో దీనిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ విమానాల ద్వారా జరుగుతోందని గ్రహించిన కస్టమ్స్ అధికారులు నిఘా పెంచారు. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది పట్టుబడ్డారు.

  • Loading...

More Telugu News