: ఆ రెండింటిలో నటనకే నా ప్రాధాన్యత: అనుష్క శర్మ
ప్రొడ్యూసర్ గా కన్నా నటనకే తన మొదటి ప్రాధాన్యత అని బాలీవుడ్ నటి అనుష్కశర్మ చెప్పింది. నటనకు ఫుల్ స్టాప్ పెట్టడం తనకేమాత్రం ఇష్టం లేదని, సినిమా రంగంలో తాను తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఇంకా ఎదగాలని తాను కోరుకుంటున్నానని అనుష్క అభిప్రాయపడింది. నటన అనే రంగానికి తన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉందని, ఆ నటనలో తాను కొనసాగాలనుకుంటున్నానని 27 ఏళ్ల అనుష్క తన మనసులోని మాటను బయటపెట్టింది. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది.అనుష్క మొట్టమొదటిసారిగా 'ఎన్ హెచ్ 10' చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. ఆ చిత్రంలో ఆమె నటించిన విషయం కూడా తెలిసిందే!