: విద్యార్థులపై బీజేపీ నేతల దాడిని ఖండిస్తున్నా: శైలజానాథ్


విజయవాడలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేయబోయిన విద్యార్థి జేఏసీ నాయకులపై బీజేపీ నేతల దాడిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఖండించారు. ప్రత్యేక హోదా అడిగితే దాడి చేయడం అమానుషమన్నారు. బెదిరింపులకు ఏపీ ప్రజలు భయపడరని చెప్పారు. విద్యార్థులపై జరిగిన దాడిని ఏపీ ప్రజలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియాతో శైలజానాథ్ మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News