: దేశాన్ని అథోగతిపాలు చేశారు: మోదీపై రాహుల్ ధ్వజం
బీహార్ ఎన్నికల ఐదో దశ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో, అరారియాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో దేశం అథోగతి పాలయిందని మండిపడ్డారు. మత విద్వేషాలు పెరిగాయని అన్నారు. దేశాన్ని కాషాయీకరణ చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా మోదీ దానిపై స్పందించడం లేదని దుయ్యబట్టారు. బీహార్ ను నితీష్ కుమార్ ఎంతో అభివృద్ధి చేశారని, అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.