: తనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై కేసీఆర్ ఎందుకు స్పందించరు?: భట్టి విక్రమార్క


గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై ఆయన స్పందించకపోవడాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నిలదీశారు. దర్యాపుపై ఎందుకు స్పందించరని విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కేసీఆర్ అవినీతికి పాల్పడివుంటే సీఎం పదవిలో ఎలా కొనసాగుతారని సూటిగా అడిగారు. అవినీతి ఆరోపణలు వచ్చాయని డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేసిన నీతిసూత్రం కేసీఆర్ కు వర్తించదా? అని అడిగారు. పదవి నుంచి దిగిపోతారో లేక తనను తాను శిక్షించుకుంటారో ప్రజలకు చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News