: 'ఉపాధి హామీ పథకం'పై కేంద్రానికి సుప్రీం నోటీసులు
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై నోటీసులు ఇచ్చింది. భత్యం చెల్లింపులు, భత్యం పెంపుదల, స్పెషల్ ఆడిట్ తదితర అంశాలపై సమగ్రమైన వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉపాధి హామీ పథకం అమలవుతున్న తీరుపై ప్రముఖ సామాజికవేత్త అరుణారాయ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఈ రోజు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.