: చైనా విద్యార్థుల ఘనత... చెంచాడు పంచదారతో 80 గంటల విద్యుత్ ఉత్పత్తి!


ఒక చెంచా పంచదారను ఇస్తే మీరేం చేస్తారు? ఇంకేం చేస్తాం... గబుక్కున నోట్లో వేసుకుని లాగించేయడమే అంటారా? చైనాలోని తియాంజిన్ యూనివర్శిటీ విద్యార్థులు మాత్రం ఆ పని చేయలేదు. ఏకంగా 80 గంటల పాటు 520 మిల్లీ వాట్ల విద్యుత్ ను అందించే సూక్ష్మ వ్యవస్థను అభివృద్ధి చేశారు. వీరు ఈకోలి, షెవానెల్లా, బి సబ్టిలిన్ అనే సూక్ష్మజీవుల కలయికలో ఓ వ్యవస్థను తయారు చేశారు. ఇది సాధారణ లీథియం బ్యాటరీకి సమానంగా నిలిచింది. మొత్తం 19 మంది కాలేజీ, హైస్కూలు విద్యార్థుల బృందం ఈ మైక్రో సిస్టమ్ ను తయారు చేసింది. గతంలో ఈ టీమ్ ఎంతమాత్రమూ కాలుష్యం విడుదల చేయని బ్యాటరీ తయారీ వ్యవస్థను కనిపెట్టి 2015 సంవత్సరానికిగాను ఐజేఎం (ఇంటర్నేషనల్ జనటికల్లీ ఇంజనీర్డ్ మెషీన్) పోటీల్లో బంగారు పతకాన్ని సైతం సాధించారు. ఇప్పుడు వీరు పంచదారను వినియోగించి మరింత విద్యుత్ ను తయారు చేసే పనిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News