: రేపు ఢిల్లీకి చంద్రబాబు... ఢిల్లీ-బెంగళూరు మధ్య చక్కర్లు కొట్టనున్న ఏపీ సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రేపు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళుతున్నారు. ఈ నెల 4న ఢిల్లీలో ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆ మరునాడు ఆయన ఢిల్లీ నుంచి నేరుగా కర్ణాటక రాజధాని బెంగళూరు వెళతారు. సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) సదస్సులో పాలుపంచుకునేందుకే ఆయన బెంగళూరు వెళుతున్నారు. ఆ సదస్సు అనంతరం ఈ నెల 6న చంద్రబాబు అటు నుంచి అటే మళ్లీ ఢిల్లీ వెళతారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు మరోమారు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత ఈ నెల 7న చంద్రబాబు హైదరాబాదుకు చేరుకుంటారు.