: ఇక 'మేడిన్ చైనా విమానాలు'... సొంతంగా ప్రయాణికుల విమానం రెడీ!


మరో ఘనతను సాధించే దిశగా చైనా ముందడుగు వేసింది. పౌర విమానయాన రంగంలో తొలిసారిగా పాసింజర్లను తీసుకెళ్లే పెద్ద విమానాన్ని తయారు చేసింది. సీ919 పేరిట తయారైన ఈ విమానంలో 168 మంది ప్రయాణించే వీలుంటుంది. షాంగైలోని కేంద్రంలో కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (కోమాక్) సహకారంతో ఈ విమానాన్ని తయారు చేస్తున్నట్టు గతంలోనే చైనా ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశామని, భవిష్యత్తులో యూఎస్ కు చెందిన ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే తమ లక్ష్యమని కోమాక్ చైర్మన్ జిన్ జువాంగ్ లాంగ్ వెల్లడించారు. చైనా విమానయాన చరిత్రలో ఇది కీలక ఘట్టమని ఆయన అన్నారు. కాగా, మొత్తం 39 మీటర్ల పొడవుండే విమానానికి తెల్లరంగును, తోక భాగాన్ని ఆకుపచ్చ రంగుతో నింపారు. ఇది ఒకసారి గాల్లోకి లేస్తే ఆగకుండా 5,555 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, వచ్చే సంవత్సరం నుంచి సేవలందిస్తుందని తెలిపారు. ఇప్పటికే దేశవాళీ కొనుగోలుదారుల నుంచి 517 విమానాలకు, థాయ్ లాండ్ సిటీ ఎయిర్ వేస్ నుంచి 10 విమానాలకు ఆర్డర్లున్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News