: లాలు 16 ఏళ్లు, నితీష్ పదేళ్లు... ఎలాంటి మార్పు లేదు: మోదీ


మహాకూటమి నేతలపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. 16 ఏళ్ల పాటు ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, పదేళ్ల పాటు జేడీయూ నేత నితీష్ కుమార్ లు బీహార్ ను పరిపాలించారని... అయినా, రాష్ట్రంలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయారని విమర్శించారు. బీహార్ లో ఆటవిక పాలన కొనసాగుతోందని... ఈ పాలనపై బిహారీ మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత పాలకులపై ఉందని చెప్పారు. తాను బీహార్ కు వస్తుంటే మహాకూటమి నేతలు విమర్శిస్తున్నారని... తాను బీహార్ కు రాకూడదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News